" అమ్మసాంస్కృతిక  స్వచ్చంద సంస్థ               

సత్యవాణి 

తల్లిని గౌరవించు                                                                                                        పేదతల్లులను,కళాకారులను ఆదరించు                                            

             సృష్టిలో సుందరమైనది " అమ్మ" రూపం. ప్రేమ అనే పదానికి అర్ధం "అమ్మ". ఏమున్నది "అమ్మ" జోల పాట కన్నా మిన్న. తనను తాను త్యాగం చేస్తూ మన ఎదుగుదల కోరుకొంటూ, అనుక్షణం  మనకోసం  బ్రతుకుతుంది "అమ్మ". అమ్మ ప్రేమ అమూల్యం... అది తీర్చుకోలేని ఋణం. భగవంతుని దృష్టిలో "అమ్మ"కు ప్రధమ స్థానం ఇవ్వబడినది. "అమ్మ" అనే పదం రెండు అక్షరాలే అయినా ఆ మాట అమృతంతో సమానం. ఆ పిలుపులో ఒక తృప్తి, కమ్మదనం ఇమిడి వున్నాయి.
            
              భగవంతుడు "అమ్మ"ను తన ప్రతిరూపంగా సృష్టించాడు. బిడ్డను తొమ్మిది నెలలు మోసి, కనటం తల్లికి మరోజన్మనెత్తడమే. అయినా ఆ తల్లి తన బిడ్డను చూసుకొని ఆ కష్టాన్నిమరచి రక్తాన్నిపాలుగా మార్చి బిడ్డ ఆకలి  తీరుస్తుంది. అలాగే తండ్రి కూడా  అంతే భాద్యతగా బిడ్డను పెంచి పోషిస్తాడు. తల్లీ, తండ్రి... ఇద్దరూ కలసి పిల్లల భవిష్యత్  కోసం ఎంతో కష్టపడి వాళ్ళను ముందుకు  నడిపిస్తారు. అందుకే తల్లీ ,తండ్రి ఇద్దరూ ప్రత్యక్ష దైవాలయ్యారు. మాతృదేవోభవ,పితృ దేవోభవ. అవసాన దశలోఉన్న తల్లిదండ్రులను కష్టపడకుండా సంతోషం గా చూడటం బిడ్డలుగా మన కర్తవ్యం. భగవంతుడు కూడా తల్లిదండ్రులకు ప్రముఖమైన స్థానాన్నిచ్చాడు.అమ్మ ఉన్నంతవరకు ఆకలి విలువ తెలియదు నాన్న ఉన్నంతవరకు భాద్యత తెలియదు ఆ ఇద్దరూ లేని జీవితం? ఈ విషయాన్ని బిడ్డలమైన మనమంతా ఒక్కసారి  ఆలోచించాలి.
             
             దేశం మనకేమి చేసింది అని కాక మనం దేశానికి ముఖ్యంగా పేద తల్లులకు పేద కళాకారులకు మన వంతు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రముఖ గాయిని శ్రీమతి.సత్యవాణి (52.గంII నాన్ స్టాప్ సింగింగ్ రికార్డ్ హోల్డర్) అధ్వర్యంలో 2000 వ సంవత్సరం నుంచి అవసాన దశలో ఆదుకునేవారు లేని వృద్ధ, అనాధ అమ్మానాన్నలకు, వృద్ధ కళాకారులకు "అమ్మ"(ASSISTANCE of poor MOTHERS and MUSIC ARTISTS) సాంస్కృతి స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయం అందిస్తూ అనేక స్వచ్ఛంద  కార్యక్రమాలు మిత్రుల సలహాలు, సహకారంతో నిర్వహిస్తున్నారు. పేద  తల్లిదండ్ర్లను గౌరవిస్తే  పరమాత్మను సేవించినట్లే  

             2007 వ సంవత్సరంలో రవీంద్రభారతి వేదిక పై 52.గంటలపాటు రాష్ట్రంలోని అనేక మంది కళాకారుల సహకారంతో నాన్ స్టాప్ గా  పాటలు పాడి  అదే వేదికపై సుమారు 70 మంది కళాకారులకు...ప్రముఖ గాయిని శ్రీమతి పి.సుశీల అమ్మ, ప్రముఖ సినీనటులుశ్రీ.అక్కినేని.నాగేశ్వరరావు, శ్రీమతి జమున, శ్రీమతి రావుబాలసరస్వతి, ప్రముఖ నటులు రాజకీయవేత్త శ్రీ బాబుమోహన్ మరియు ఎంతోమంది ప్రముఖుల ద్వారా సహాయం అందచేయటం గాయిని సత్యవాణి "అమ్మ" సంస్థ గర్వంగా చెప్పుకో తగిన విషయం.

          2008 వ సంవత్సరంలో ప్రముఖ సంగీత దర్శకులు జె.వి.రాఘవులు గారిని రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఆహ్వానించి  స్థానిక చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ నందు పురప్రముఖులతో పాటు ప్రముఖ సినీ కళాకారులు, రాజకీయ నాయకులైన శ్రీ.బాబు మోహన్ గారు వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో ఘనంగా సన్మానించి వారిని ఆర్ధికంగా ఆడుకోవటం" అమ్మ" సంస్థ తన అదృష్టంగా భావిస్తుంది. అదే క్రమంలో ఎంతో మంది పేదలకు "అమ్మ"  స్వచ్ఛంద సంస్థ సహాయం నిత్యం అందచేయబడుతోంది. సహాయం అందుకొన్న తల్లిదండ్రుల  దీవనలతో "అమ్మ" సంస్థ ముందుకు సాగుతోంది.

          2014 వ సంవత్సరం ప్రముఖ సినీ నేపధ్య గాయకులు శ్రీ.వి.రామకృష్ణ గారు, ప్రముఖ హాస్యనటులు శ్రీ గుండుహనుమంత రావు బృందం, ప్రముఖ నటులు రాజకీయవేత్త శ్రీ బాబుమోహన్, స్థానిక ప్రజా ప్రతినిధులు శ్రీ ఆర్.కృష్ణయ్య, స్థానిక నాయకులు "అమ్మ" చారిటి సంస్థ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంనకు విచ్చేసి సుమారు 80 మంది వృద్ధ, పేద తల్లిదండ్రులకు పేద కళాకారులకు  నూతన వస్త్రములు మరియు నిత్యావసర వస్తవులు పంపిణీ చేసి పేద తల్లిదండ్రుల దీవనలు పొందారు. సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి సత్యవాణి ని అభినందిచారు.

            2015  వ సంవత్సరం ప్రముఖ సినీ నేపధ్య గాయిని గాన కోకిల శ్రీమతి ఎస్.జానకి అమ్మ పేద వృద్ధ తల్లిదండ్రులు మరియు పేద కళాకారులపై  ఎంతో ప్రేమతో "అమ్మ" సత్యవాణి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసి పేదలకు సేవ చేస్తున్న సత్యవాణి బృందాన్నిసరస్వతి రూపమైన ఆమె అభినందించారు. అమ్మ గారి దివ్య హస్తాలతో సుమారు 100 మంది పేదలకు  నిత్యావసర  వస్తువులు నూతన వస్త్రాలు అందచేసారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ టి.వి కళాకారులు, సినీ కళాకారులు, రాజకీయ నాయకులు అనేకమంది హాజరయ్యారు.

           "అమ్మ"కు మనమంతా బిడ్డలమే. కులమతాలకు అతీతం "అమ్మ" ప్రేమ. ప్రతిఒక్కరు స్పందించి, పేద తల్లిదండ్రులకు మనవంతు సహాయసహకారాలందించి వారిని  ఆదరిద్దాం... ఈవిధంగా మనవారికి సేవచేస్తున్నామనే సంతృప్తి పొందుదాం, తల్లిదండ్రుల దీవనలు స్వీకరిద్దాం.
 
                 సహ్రుదయు లైన మీరంతా మన "అమ్మ" (ASSISTANCE of poor MOTHERS and MUSIC ARTISTS)  సంస్థ ద్వారా మరెంతో మంది పేద తల్లిదండ్రులకు,పేద కళాకారులకు సహాయం అందించుటకు మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించ వలసినదిగా ప్రార్దిస్త్తున్నాము
 
                                                                                  
                                                                                  సహాయం అందించుటకు :-

          SBH  VANASTHALI PURAM Branch.HYDA/C NO.62345510418, IFSC CODE: SBHY0020564, SWIFT CODE: SBHY1NBB002 .